ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరిక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.
బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హలు నందు ఇంటర్మీడియట్ నోడల్ అధికారుల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లా లో మొత్తం 16 సెంటర్ లు ఉన్నాయని , పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నియమాలను పాటిస్తూ , విద్యార్థులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపారు. సానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేసి కేంద్రాలను పూర్తిగా సానిటైజ్ చేయించాలని, పరీక్షా సమయం లో నిరంతర విద్యుత్ సరపరా ఉండాలని, తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ చేసే పోలిస్ స్టేషన్లలో బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలీస్ బందోబస్తు ఉపయోగించి ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపిణి చేయాలనీ, ప్రతి సెంటర్ కు ఇద్దరు పోలీస్ సిబ్బందిని బందోబస్తుగా ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలనీ, పరీక్షా కేంద్రాల ఆవరణ లో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్ లను ఉదయం 9 నుండి మధ్యాహ్నం12 గంటల వరకు మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ పై నిఘా వుంచాలని రెవిన్యూ , పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు వైద్య సిబ్బంది ని ఏర్పాటు చేసి, ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్న వెంటనే వైద్య సేవలు అందించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వైధ్యాదికారులకు సూచించారు. పరీక్ష సమయానికి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా అన్ని మండలాలకు బస్సు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని, గట్టు , మానవపాడు, మండలాలకు సింగల్ బస్సు ఉన్నందున బస్సుల సంఖ్య పెంచే విధంగా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరారు. విద్యార్థుల వద్ద ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు (ఫోన్లు, వాచ్ లు) హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నారు. హాల్ టికెట్ నెంబర్లను పరీక్షా కేంద్రాలలోని నోటీసు బోర్డు లో డిస్ప్లే చేయలన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చెపట్టాలని ఆదేశించారు.
సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురామ్ శర్మ, ఇంటర్మీడియట్ కన్వీనర్ హృదయ రాజు, డి.ఎస్.పి రంగస్వామి, జిల్లా వైద్యాధికారి చందునాయక్, సంబందిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————– జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.