ఈ నెల 25 వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

ఈ సందర్భంగా పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులకు ఆల్బెస్ట్ తెలిపారు. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలగాని, ప్రతి ఒక్కరూ మంచి గ్రేడింగ్లతో ఉత్తీర్ణత సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పరీక్షలకు 8119 మంది రెగ్యులర్ విద్యార్థులు, 2738 మంది వృత్తి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. జిల్లాలోని 14 మండలాల్లో కొత్తగూడెంలో 7, భద్రాచలంలో 4, పాల్వంచలో 4, మణుగూరులో 3, ఇల్లందులో 4, అశ్వారావుపేటలో 3, చర్లలో 1, బూర్గంపాడులో 1, పినపాకలో 1, గుండాలలో 2, టేకులపల్లిలో 1, దుమ్ముగూడెంలో 1, ముల్కలపల్లిలో 1, జూలూరుపాడులో 1 మొత్తం 34 పరీక్షా కేంద్రాలు.. ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, 9 గంటల తదుపరి ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని చెప్పారు. పరీక్షలు నిర్వహణకు నియమించిన కన్వీనర్ తో పాటు ఇద్దరు సభ్యులు ప్రతి రోజు పరీక్షకు హాజరైన విద్యార్థుల సమాచారం అందచేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలల్లో ఏర్పాట్లును సంబంధిత మండలాల తహసిల్దారులు, యంపిడిఓల ద్వారా పరిశీలన చేపించినట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహణకు 34 మంది చీఫ్ సూపరింటెండ్లు. 34 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, రెవిన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన రెండు ప్లైయింగ్ స్క్యాడ్స్, ముగ్గురు సిట్టింగ్స్ స్క్వాడ్స్ విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విధ్యార్థులు ఉదయం 8 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. విద్యార్థులు కొరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. పరీక్షకు హజరయ్యే విద్యార్థులు తప్పని సరిగా మాస్కు ధరించడంతో పాటు కరోనా నియంత్రణ ప్రోటోకాల్స్ పాటించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో ప్రతి రోజు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని చెప్పారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసి తగినన్ని మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న విద్యార్థులను ప్రత్యేక గదులు ఏర్పాటు చేసి పరీక్ష రాసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన నోడల్ అధికారికి సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతి లేదని, విద్యార్థులు ఇట్టి విషయాన్ని గమనించాలని ఆయన స్పష్టం చేశారు.

 

Share This Post