ఈ నెల 26 నుండి 31వ తేది వరకు 2BHK లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.                                                                   తేది:23.7.2021.
వనపర్తి.
ప్రతి పేదవారి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్లు పథకమును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఈ నెల 26వ తేది నుండి 31వ తేది వరకు గడువు ఉంటుందని ఆమె తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వార్డుల వారీగా ప్రత్యేక కేంద్రాలలో దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజల సౌకర్యార్థం 33 కేంద్రాలలో వార్డ్ వారీ ఇంచార్జీ ల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారని, ఆయా వార్డుల్లో వారికి కేటాయించిన పరిధిలో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలిపారు. చిట్యాల రోడ్డు, వనపర్తి నందు నిర్మించిన 240 ఇండ్లకు, పెద్దగూడెం దగ్గర నిర్మించిన 296 ఇండ్లకు దరఖాస్తులు చేసుకొనుటకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు నమూనాలోనే ప్రజలు ఆర్జీ దాఖలు చేయాలని ఆమె సూచించారు. అర్హత కలిగిన పట్టణ ప్రజలు తప్పని సరిగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

గమనిక:1) వార్డుల వారీగా ఏర్పాటు చేయబడిన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల జాబితా, అర్జీలను స్వీకరించే అధికారుల వివరాలు జత పరచడమైనది.
2) నమూనా దరఖాస్తు ఫారం జత చేయనైనది.

2BHK application form
Double bedroom incharge list2BHK application form

Share This Post