*ఈ నెల 28 వరకు జిల్లాలో వాయిదా పడిన రెండు మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ:: జిల్లా ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి

*ఈ నెల 28 వరకు జిల్లాలో వాయిదా పడిన రెండు మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ:: జిల్లా ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి

*ప్రచురణార్దం-1*
జనగామ, నవంబరు 25: జిల్లాలో వాయిదా పడిన మద్యం దుకాణాల దరఖాస్తులు ఈ నెల 28 వరకు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. జిల్లాలో వాయిదా పడిన మద్యం దుకాణాలు గెజిట్ షాప్ నెంబరు JAN 006, JAN 011, జనగామ మండలం పెంబర్తి లో ఒక్కటి, జనగామ మున్సిపల్ పరిధిలో ఒక్కటి లకుగాను ప్రభుత్వ నిబధనల ప్రకారం ఈ నెల 25 నుండి 28 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 29 వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించనునట్లు ఆయన అన్నారు. ఇట్టి దరఖాస్తులు నర్మెట్ట రోడ్ నందు గల జిల్లా ఎక్సైజ్ కార్యాలయం, దేవాదుల ఇర్రిగేషన్ క్వార్టర్స్, క్వార్టర్ నెం. 5 నందు సమర్పించాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post