ఈ నెల 3 నుండి చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ నెల 3 నుండి చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

బడిబాట సన్నాహక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్లో విద్య, సంక్షేమ, పరిశ్రమలు, కార్మిక తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిబయటి పిల్లలను బడుల్లో చేర్చేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలలో చేర్పించాలన్నారు. ఇటుక బట్టిలు, హోటల్లు,పరిశ్రమలు ,దుకాణాలలో పనుల్లో ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలకు తీసుకువచ్చేందుకు కార్మిక శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చిన్న పిల్లలతో పనిచేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలకు వెళ్లే ఈడు పిల్లల వివరాలను ఎం ఈ ఓ లకు అందించాలన్నారు.

ఒకటో తరగతిలో చేరవలసిన విద్యార్థులను అంగన్వాడీ టీచర్లు సమీప పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఐదు సంవత్సరాలు పూర్తయిన పిల్లల వివరాలను శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు.

5వ తరగతి, 7వ తరగతి వరకు చదివి తర్వాత తరగతుల్లో చేరాల్సిన విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా చూడాలన్నారు.

ఈ నెల 3 నుండి 10 వరకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి విద్యార్థుల ఎన్రోల్మెంట్ చేయాలన్నారు, ముఖ్యంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్న ట్లు గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పోరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన తో పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయనున్నట్లు తెలియజేయాలన్నారు.

అన్ని సంక్షేమ శాఖల వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, గత సంవత్సరం నమోదైన విద్యార్థులు, ఈ సంవత్సరం హాస్టల్ వారీగా ఎంతమంది విద్యార్థుల లక్ష్యం నిర్ణయించాలనీ, ఆ మేరకు ఈ నెల 10 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. జూన్ 11 నుండి 30 వరకు డ్రైవ్ గా చేపట్టాలని సూచించారు.

వసతి గృహాలలో పాఠశాలల ప్రారంభం కన్నా ముందే అవసరమైన మరమ్మతులను చేయించాలని, అన్ని మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని సంక్షేమ అధికారులకు సూచించారు.

బడిబాట కార్యక్రమం పండుగ వాతావరణంలో జరగాలని, ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్ డి ఓ నగేష్, విద్య, డి ఆర్ డి ఓ, బీసీ ,ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ, కార్మిక ,పరిశ్రమల శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post