ఈ నెల 3 నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రజాప్రథినిధులు, అధికారులు భాగస్వాములై విజయంవంతం చేయవలసినదిగా జిల్లా పరిషద్ చైర్ పర్సన్ – ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ కోరారు.

ఈ నెల 3 నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రజాప్రథినిధులు, అధికారులు భాగస్వాములై విజయంవంతం చేయవలసినదిగా జిల్లా పరిషద్ చైర్ పర్సన్ – ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ కోరారు.

ఈ నెల 3 నుండి పక్షం రోజుల పాటు చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో ప్రజాప్రథినిధులు, అధికారులు భాగస్వాములై విజయంవంతం చేయవలసినదిగా జిల్లా పరిషద్ చైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించిననాడే అసలైన ప్రగతి సాధించినట్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నారని వారి ఆకాంక్ష మేరకు అందరు సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్రంలో ముందుంచాలని పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి అద్యక్షతవహిస్తు పల్లెప్రగతి ద్వారా నేడు పల్లెలలో గుణాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగిననాడే పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరుస్తాయాని ఈ కతృవులో జెడ్.పి.టి.సి.లు, మండల అధ్యక్షులు, ఏం.పి.టి.సిలు, సర్పంచులు, అధికారులు భాగస్వాములై సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్రముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరి సమిష్టి కృషి ఫలితంగా దేశంలో పదికి పది ర్యా0కులు సాధించామని అన్నారు. కార్యక్రమాల అమలులో కొన్ని లోపాలుంటాయని, పాజిటివ్ దృక్పధంతో చూస్తే అన్ని సవ్యంగా కనపడ్తాయని అన్నారు. 2014 కు పూర్వం గ్రామాల స్థితి, నేడు పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వైకుంఠధామాలు, డంప్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు తో పచ్చదనం, పరిశుభ్రతతో పరిఢవిల్లుతున్న గ్రామాల ప్రగతిని స్పష్టంగా గమనించాలన్నారు. పల్లెలు బాగున్నా పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని, ఈ సారి ఛాలెంజ్ గా తీసుకొని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ మచ్చ లేకుండా చూడాలని కోరారు. పల్లె ప్రగతి చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి పేమెంట్ జాప్యం లేకుండా చూడాలని పంచాయతీ రాజ్ అధికారులకు సూచించారు. సంబంధిత శాఖా అధికారులందురు కలిసిమెలిసి పనిచేసి జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు.
జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ప్రతి పల్లెకు వైకుంఠధామం ,డంప్ యార్డ్, పల్లె వనాల ఏర్పాటు వల్ల నేడు గ్రామాలలో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నదని అన్నారు. అల్లాదుర్గ్, టేక్మాల్ వంటి మండలాల్లో కార్యక్రమాలు మెరుగుపడవలసి ఉన్నదని ఆ దిశగా మండల ప్రత్యెకధికారులు, మండల పరిషద్ అధికారులు, ఏం.పి.ఓ.లు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. మండల వారీగా మంజూరైన పనులు, పూర్తైన ,ప్ర గతిలో ఉన్న పనుల సమగ్ర వివరాలు అందించవలసినదిగా అధికారులకు సూచించారు. ఈ నెల 3 నుండి 18 వరకు రోజు వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. వైకుంఠధామం చుట్టూ రెండు వరుసలలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, నీటి సౌకర్యం ఉండేలా చూడాలని, అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలలో విరివిగా మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. నిర్ణీత కాలవ్యవధి ప్రకారం మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. పల్లె ప్రగతి పెండింగ్ బిల్లులు రెండు రోజులలోగా క్లియర్ చేయవలసినదిగా ఏం.పి .డి.ఓ.లకు సూచించారు. ప్రతి మండలంలో స్థలాలను గుర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పల్లె ప్రగతి పట్ల సంతృప్తి గా ఉన్న పట్టణ ప్రగతి బాగాలేదని, ఈ సారి కౌన్సిలర్ల భాగస్వామ్యం తో సిస్టమాటిక్ గా పనిచేయాలన్నారు. పట్టణాలలో ప్రతి దుకాణం ఎదుటి మొక్క నాటేలా దుకాణ యజమానులకు సూచించాలని, మల్టి లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని అన్నారు. మునిసిపల్ ప్రాంతాలలో నర్సరీల సక్రమ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులను కేటాయించామని వారి సేవలను ఉపయోగించుకోవలసినదిగా మునిసిపల్ కమీషనర్ల సూచించారు. ప్రతి వార్డులో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా జూన్ 2 న ప్రతి మండలంలో 2, మునిసిపల్ వార్డులలో తెలంగాణా గ్రామీణ, పట్టణ క్రీడా ప్రాంగణాల ప్రారంభానికి సిద్ధం చేయాలనీ, వాటికీ 50 వేల విలువగల కిట్లు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. కార్యక్రమం అనంతరం 5 ఉత్తమ, 5 బాగాలేని గ్రామపంచాయితీలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, జెడ్.పి . సీఈఓ శైలేష్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ తరుణ్ కుమార్, ఆర్డీఓలు సాయి రామ్, శ్యామ్ ప్రకాష్, వెంకట ఉపేందర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, జెడ్.పి .టి.సి లు, ఏం.పి .పి .లు ఏం.పి .డి.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post