పత్రికా ప్రకటన తేది:30.01.2023, వనపర్తి.
ఈ నెల 30, 31వ తేదిన బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహాల బాలుర విద్యార్థులకు ఎవరెస్ట్ టాస్క్ పర్వతారోహణ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం భువనగిరి ఖిల్లా వేదికగా నిర్వహిస్తున్నట్లు, ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ తెలిపారు.
సోమవారం భువనగిరి ఖిల్లా వేదికగా రాక్ క్లైంబింగ్ స్కూల్ పర్యవేక్షణలో వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల బి.సి. సంక్షేమ శాఖ వసతి గృహాల బాలుర విద్యార్తులకు ఎవరెస్టు టాస్క్ పర్వాతారోహణ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణకు వనపర్తి జిల్లా నుండి (57) మంది విద్యార్థులు, నాగర్ కర్నూల్ నుండి (54) మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వసతి గృహాల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం కల్పించి, ఎవరెస్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ నెల 30, 31వ. తేదీలలో రెండు రోజుల శిక్షణ పూర్తిచేసి, ఇందులో నైపుణ్యత పొంది ఎవరెస్ట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు.
వసతి గృహాల విద్యార్థులను వివిధ రంగాలలో తీర్చిదిద్దేందుకు ఎవరెస్ట్ టాస్క్‌తో పాటు సాహస క్రీడల్లో అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల్లో సామర్థ్యం ఆధారంగా, శిక్షణలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన విద్యార్థులకు భారత సైన్యం పర్యవేక్షణలో మంచు పర్వతారోహణపై శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎవరెస్ట్ టాస్క్‌కు ఎంపిక అవుతారని బీసీ సంక్షేమ శాఖ అధికారి సూచించారు. ఈ శిక్షణను బి.సి. సంక్షేమ వసతి గృహాల బాలురు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో వనపర్తి బి.సి. సంక్షేమ శాఖ అధికారి అనిల్ కుమార్, సహాయ సంక్షేమ అధికారి శ్రీధర్, వనపర్తి, నాగర్ కర్నూలు వసతి గృహాల వార్డెన్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.