ఈ నెల 31 లోగా యాసంగి సి.యం.ఆర్. డెలివరీ పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్

పత్రికా ప్రకటన యాసంగి సి.యం.ఆర్.డెలివరీ ఈ నెల 31 లోగా పూర్తి చేయాలి:అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ నల్గొండ,జనవరి 12. యాసంగి పంట కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీ ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి. చంద్ర శేఖర్ అధికారులను,మిల్లర్ లను ఆదేశించారు
బుధవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత యాసంగి పంట కాలానికి సంబంధించిన 19986 ఏ.సి.కె కస్టమ్ మిల్లింగ్ బియ్యము మిల్లర్ లు పెట్టవలసి ఉండగా 14472 ఏ.సి.కె కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇప్పటి వరకు డెలివరీ చేశారని ఇచ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించారు. రాబోయే 20 రోజుల లో మిగతా బ్యాలెన్స్ 5514 ఏ.సి.కె.కస్టమ్ మిల్లింగ్ బియ్యం డెలివరీ చేయాలని మిల్లర్లను కోరారు. మిల్లర్లు అందరూ తమకు కేటాయించిన గోడౌన్లలో వెంటవెంటనే రోజువారీ బియ్యం ను టార్గెట్ గా పెట్టుకొని డెలివరీ చేయాలని కోరారు. ప్రభుత్వ సెలవు దినాలలో కూడా గోడౌన్లు పని చేస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు బియ్యం డెలివరీ లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు .
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, ఎఫ్ సి ఐ మేనేజర్ విజయభాస్కర్, ఏఎంసి సివిల్ సప్లై ఆఫీసర్ దేవదాస్ , మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, నల్లగొండ రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి భద్రాద్రి రాములు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు మహేందర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు

Share This Post