ఈ నెల 6న వివిధ క్రీడలకు జిల్లా జట్ల ఎంపిక

 

ఈ నెల 6న వివిధ క్రీడలకు జిల్లా జట్ల ఎంపిక

ఈనెల 10 మరియు 11వ తేదీలలో
హైదరాబాదులో జరగనున్న రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ సెలక్షన్స్ 2021-22 లో పాల్గొనుటకు జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రాం చందర్ రావు బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 6న సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ ,బ్రిడ్జి, బాస్కెట్ బాల్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్ బాల్, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, రెస్లింగ్ (కుస్తీ), వెయిట్ లిఫ్టింగ్ అండ్ బెస్ట్ ఫిజిక్(పురుషులకు) హాకీ, కబడ్డీ, వాలీబాల్ ( పురుషులు మరియు స్త్రీలు) క్రీడాంశాల్లో జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల లో పనిచేస్తున్న ఆసక్తి కలిగిన పర్మినెంట్ మినిస్టీరియల్ ఉద్యోగులు సర్వీస్ సర్టిఫికెట్,/ఇటీవల తీసిన ఐడెంటిటీ కార్డు తో నవంబర్ 6న ఉదయం 11 గంటలకు సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్, రెండవ అంతస్తులో గల జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయంలో హాజరు కావలసిందిగా ఆయన సూచించారు.

మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 08455-276010 /274344 లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Share This Post