ఈ నెల 8న సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం…..

ప్రచురణార్థం

ఈ నెల 8న సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం…..

మహబూబాబాద్, జూన్ -07:

దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం బుధవారం 8న ఉదయం 11-00 గంటల నుండి మీ- సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడోక ప్రకటనలో తెలిపారు.

శారీరక వైకల్యం, వినికిడి లోపం, దృష్టి లోపం, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు ఈ నెల 16, 23, 30 తేదీలలో కొత్తగా నమోదు కోసం మూడు తేదీల్లో రోజుకు 65 చొప్పున, రెన్యువల్ కోసం మూడు తేదీల్లో రోజుకు 55 మంది చొప్పున స్లాట్స్ కు అవకాశం ఉన్నట్లు తెలిపారు.

బుధవారం 8న ఉదయం 11-00 గంటలకు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post