పత్రికా ప్రకటన. తేది:07.06.2022, వనపర్తి.
షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 1వ. తరగతి, 5వ. తరగతులలో ప్రవేశం పొందుటకు లక్కీ డిప్ ద్వారా సీట్లను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్య అతిథిగా హాజరవుతారని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని నుషిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 8వ తేదీన ఉదయం గం. 11.00 లకు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె సూచించారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.