ఈ నెల 8వ. తేదీన “మెగా రుణ మేళ” కార్యక్రమం : లీడ్ బ్యాంక్ మేనేజర్ వై.సురేష్

పత్రికా ప్రకటన.      తేది:7-6-2022, వనపర్తి.

ఈ నెల 8వ. తేదీన వనపర్తి పట్టణంలోని దాచ లక్మయ ఫంక్షన్ హాల్ యందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లీడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో “మెగా రుణ మేళ” కార్యక్రమం నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ముఖ్యఅతిథిగా హాజరవుతారని లీడ్ బ్యాంక్ మేనేజర్ వై.సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ రుణమేళాలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,  ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన ముద్ర, పి.ఎం.స్వానిధి, స్టాండ్ అప్ ఇండియా, అగ్రి, పి.ఈ.ఎం.జి.పి, పి.ఎం. ఎఫ్.ఎం.ఈ, ఎమ్.ఎస్.ఎం.ఈ. రుణాలపై అవగాహన కల్పించి, అర్హులైన లబ్ధిదారులకు  తక్షణమే రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలు అందరు  రుణ మేళ కార్యక్రమంలో పాల్గొని, ఈ మెగా రుణ మేళా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
———————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post