ఈ నెల 9న న్యాయ సేవల అవగాహన శిబిరం
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.జి. ప్రియదర్శిని
00000
ఆజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా ఈనెల 9వ తేదీన న్యాయ సేవల అవగాహన శిబిరం (లీగల్ అవేర్నెస్ క్యాంప్) నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎం.జి. ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయసేవాధికార దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్ట్ ప్రాంగణంలోని మెడిటేషన్ సెంటర్ లో ఉదయం 9.30 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని జిల్లా జడ్జి తెలిపారు. జిల్లాలోని న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అందరూ శిబిరము లో పాల్గొనాలని జిల్లా జడ్జి ఆ ప్రకటనలో కోరారు.