ప్రచురణార్థం
ఈ నెల 9న బ్యాటరీ ట్రై సైకిల్స్ ,కాలిపర్స్ , కృత్రిమ అవయవాల కొరకు ఎంపిక శిబిరం…
జనగామ మే 07.
ఈనెల 9వ తేదీన బ్యాటరీ ట్రై సైకిల్స్ ,కాలిపర్స్ , కృత్రిమ అవయవాల కొరకు ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నందున దివ్యాంగులు తప్పనిసరి గా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలిపారు.
స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నందున అంగవైకల్యం కలవారు హాజరు కావాలన్నారు.
బ్యాటరీ ట్రై సైకిల్ ఎంపికలో వికలాంగులు తమ వైకల్యం శాపం 80% పై ఉండాలని, 16 సంవత్సరాల పైబడి కుటుంబ వార్షిక ఆదాయం ఒక లక్షా ఎనభై వేల మించకుండా ఉండాలన్నారు.
కాలిపర్స్ ఎంపికలో శారీరక దివ్యాంగులు కోల్పోయిన కాళ్లు కృత్రిమంగా అమర్చేందుకు కొలతలు తీసుకోబడతాయని తదుపరి వాటిని తయారు చేసి అమర్చుట కు మరొక శిబిరం ఏర్పాటు చేయబడుతుందని తెలియజేశారు.
అర్హులైన దివ్యాంగులు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రం తో పాటు ఆధార్ కార్డు, వైకల్య (సదరం)ధ్రువీకరణ పత్రము, 3పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తో శిబిరానికి హాజరుకావాలని అర్హతలేని ఇతర శారీరక దివ్యాంగులు ఇతర కేటగిరి దివ్యాంగులు శిబిరానికి హాజరు కావద్దని విజ్ఞప్తి చేశారు ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం ఫోన్ నెంబర్ 9573139411 ను సంప్రదించాలని తెలియజేశారు.
——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది.