ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో తేది:11.02.2023 రోజున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది

పత్రికా ప్రకటన
తేదీ:31-01-2023.

ఈ రోజున, వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో తేది:11.02.2023 రోజున నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి, వరంగల్ జిల్లా ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ కె. రాధా దేవి మాట్లాడుతూ “జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల సూచనల మేరకు తేదీ 11:02:2023 రోజున వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి ఇన్సూరెన్స్ అధికారులు, సంబంధిత న్యాయవాదులు, వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఎటువంటి ఒత్తిడిలకు గురి చేయకుండా రాజీమార్గం ద్వారా వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలియజేశారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ సలహా సూచనల కొరకు అయిననూ న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలను పొందగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, కార్యదర్శి జె.ఉపేందర్ రావు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్స్ టి.రవీందర్ రావు, సి.హెచ్.లింగమూర్తి, కె.లక్ష్మారెడ్డి, బి.రమేష్ గౌడ్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, లీగల్ ఏయిడ్ న్యాయవాదులు సమావేశానికి హాజరయ్యారు.

Share This Post