పత్రికా ప్రకటన 9.3.2023
సైన్స్ కిట్ల పంపిణీ కార్యక్రమం
ఈ రోజు తేది 09.03.2023, గురువారం రోజున వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సెమినార్ హల్ లో జిల్లా పాలనాధికారి డా .బి.గోపి IAS, సంయుక్త పాలనధికారి శ్రీవత్స కోట IAS, జిల్లా విద్యాధికారి వాసంతి, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ గారి సమక్షం లో సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ సొసైటీ అధ్యక్షులు తూడి విద్యా సాగర్ రెడ్డి గారి సహకారంతో వరంగల్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు సైన్స్ కిట్ల పంపిణీ జరిగింది. జిల్లాలోని పదమూడు మండలాల్లో గల 38 పాఠశాలల కి ఒక్కొక పాఠశాల కి సుమారు 3000 రూపాయల విలువగల సైన్స్ మెటీరియల్ అందజేశారు. రిసోర్స్ పర్సన్ లు పి. సురేష్ బాబు, ఎస్. సురేష్ లు సైన్స్ కిట్ లోని వివిధ అంశాలపై పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఇట్టి పంపిణీ కార్యక్రమం లో కలెక్టర్ ఎన్.గోపి మాట్లాడుతూ సైన్స్ ప్రయోగాలతో అమూర్త భావనలపై విద్యార్థులకు మంచి అవగాహన కలుగుతుంది. అలాంటి సైన్స్ ప్రయోగ పరికరాలను విరాళంగా ప్రభుత్వ పాఠశాలలకు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తూడి విద్యాసాగర్ రెడ్డిగారు అభినందనీయులని అన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డి.వాసంతి మాట్లాడుతూ సైన్స్ కిట్స్ ను ఉపాధ్యాయులు సమర్థవంతంగా ఉపయోగించాలని అన్నారు. జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సూర్యకిరణ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మరిన్ని సైన్స్ కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.