ఈ రోజు శ్రీ రాజర్షి షా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గారు తెల్లాపూర్ మరియు రామచంద్రపురం మండలం లో పర్యటించారు.

ఈ రోజు శ్రీ రాజర్షి షా జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గారు తెల్లాపూర్ మరియు రామచంద్రపురం మండలం లో పర్యటించారు. పర్యటనలో భాగము గా BHEL లోని జ్యోతి విద్యాలయం లో జరుగుతున్న 10 వ తరగతి మూల్యాంకనం కేంద్రం ను పరిశీలించడం జరిగినది. ములయ్యంకనం కేంద్రం లో బార్ కోడింగ్ గది మరియు మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించారు.అనంతరం మూల్యాంకనం జరుగుతున్న తీరును విద్యా శాఖ అధికారి శ్రీ బాలాజీ గారు వివరించారు.
అనంతరం తెల్లాపూర్ మునిసిపాలిటీ లో జరుగుతున్న బస్తీ దవాఖాన పనులను పరిశలించారు. పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని EE TSMSIDC నీ జూన్ 16 లోపు పనులు పూర్తి చేయాలని లేనిచో పేమెంట్ నిలుపుదల చేయాలని ఆదేశించారు.
అనంతరం ఇందిరా కాలనీ లోని ప్రాథమిక పాటశాల లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను పరిశలించడం జరిగినది. అన్ని పనులను ఇంకో 10 రోజు లలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ వేణుగోపాల్ ను ఆదేశించారు.
అనంతరం తెళ్ళాపూర్ లో నిర్మించిన క్రీడా ప్రాంగణం లను పరిశీలించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ వున్నాయని వాటిని కూడా పూర్తి చేయాలని చుట్టూ మొక్కలు నాటాలని ఆదేశించారు.
అనంతరం వెలిమిల లో చాలా రోజులు గా పెండింగ్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ సమస్య ను పరిశీలించి స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్ ను పనులు తొందరగా ప్రారంభించి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని 3 ఫేజ్ కరెంట్ సమస్య కూడా వుందనీ తెలుపగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వెలిమల లో వున్న బృహత్ పట్టణ ప్రకృతి వనం ను పరిశీలించారు. తరువాత ఇదులనాగులపల్లీ లో నిర్మిస్తున్న మహా ప్రస్థానం పనులను పరశీలించడం జరిగినది. ఇంకా కొన్ని పెండింగ్ పనులు వున్నాయని తొందరగా పూర్తి చేయాలని ప్రహరీ గోడ పనులు పూర్తి చేయాలని ఆర్చి నిర్మాణ పనులు కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కొల్లూరు శివారులో వున్న డంప్ యార్డ్ ను పరిశీలించగా నిర్వహణ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో వున్న చెత్త ను ఒక దగ్గరికి చేర్చి బయో మైనింగ్ కోసం సిద్ధం గా ఉంచాలని తెలిపారు. తడి పొడి చెత్త వేరు చేయుటకు అవగాహన కార్యక్రమాలు పెంచాలని మునిసిపల్ లో వచ్చే కూరగాయల తడి చెత్త వేరుగా చేసి ఎరువు తయారు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మని కరణ్ గారు , సంజయ్ మునిసిపల్ ఇంజనీర్, వార్డు కౌన్సిలర్ లు పాల్గొన్నారు

Share This Post