ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయుటకు రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మెషిన్ లు కొనుగోలు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మండల అభివృద్ధి అధికారులకు సూచించారు.

ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయుటకు రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మెషిన్ లు కొనుగోలు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మండల అభివృద్ధి అధికారులకు సూచించారు.

ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఫాగింగ్ చేయుటకు రెండు వేల జనాభా దాటిన ప్రతి గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మెషిన్ లు కొనుగోలు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మండల అభివృద్ధి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి డి.ఎల్.పి.ఓ.లు, ఏం.పి.డి.ఓ.లు, ఏం.పి.ఓ.లు, తహసీల్ధార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జిల్లాలో దళితవాదాలు, గిరిజన నివాస ప్రాంతాలలో మెరుగైన వసతులు కల్పించుటకు సి.సి.రోడ్లు, సి.సి.మురుగు కాలువలు, విద్యుత్, మంచినీటి సౌకర్యం వంటివి కల్పించు వివరాలు సేకరించి వెంటనే నివేదిక అందజేయవలసినదిగా ఆయన సూచించారు. రెవిన్యూ, అటవీ శాఖాధికారులు సమన్వయంతో ఫారెస్ట్ ల్యాండ్ లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు .రహదారుల వెంట మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ పనులు వేగిరం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్మికులకు భీమా కల్పించుటకు ప్రీమియం డబ్బులు వెంటనే చెల్లించవలసినదిగా అధికారులకు సూచించారు. వైకుంఠధామాల నిర్మాణంలో ప్రగతి కనిపించపోతే అందుకు బాధ్యులు సర్పంచులు,కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులదేనని కలెక్టర్ హెచ్చరించారు. పన్నుల వసూళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
తహసీల్ధార్లనుద్దేశించి మాట్లాడుతూ ధరణి రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఉదయం 10. 20 గంటల వరకెల్లా లాగిన్ కావాలని అన్నారు. ధరణిలో మ్యూటేషన్ లు, వారసత్వ బదలాయింపు వంటివి పెండింగు లేకుండా చూడాలని, మ్యుటేషన్ మరీ పాతవైతే రిజెక్ట్ చేయాలన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి వివరాలను గుంటల రూపంలో ఇవ్వాలని అన్నారు. ల్యాండ్ మ్యాటర్ కు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రామాల వారీగా, సర్వే వారీగా ప్రభుత్వ భూముల వివరాలు, ప్రస్తుత తాజా పరిస్థితులపై నిర్ణీత నమూనాలో నివేదికలు అందజేయాలన్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబారక్ కు సంబందించి వచ్చిన దరఖాస్తులు పరిశీలించి పెండింగు లేకుండా చూడాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన నిరుపేద కుటుంబాలకు ఆపత్బందు ఆర్థికంగా సహాయపడుతుందని, ఇటువంటి విషయంలో తాత్పర్యం చేయకుండా వెంటనే అందించాలని సూచించారు. జిల్లాలో 28 కేసులు పెండింగులో ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన వెంటనే మంజూరు ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.పి.ఓ. తరుణ్ కుమార్, ఆర్.డి.ఓ. సాయి రామ్, డి.ఎల్.పి.ఓ.లు తహసీల్ధార్లు,ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post