ఈ.వి.ఎం. గోదాం ను తనిఖీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఈ.వి.ఎం. గోదాం ను తనిఖీ, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ఈ.వి.ఎం. గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు స్థల పరిశీలన

మహబూబాబాద్, మే -24:

ఈ.వి.ఎం. గోదామును జిల్లా కలెక్టర్ కె. శశాంక తనిఖీ చేశారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి కురవి రోడ్డులో గల ఈ.వి.ఎం. గోదాము ను పరిశీలించారు.

మాసవారి తనిఖీల్లో భాగంగా ముందుగా కలెక్టర్ తాళం వేసి ఉన్న స్ట్రాంగ్ రూం పరిశీలించారు. ముందస్తు అనుమతి లేనిదే ఆవరణలో అనుమతించరాదని తెలిపారు. సి.సి. కెమెరాల పనితీరు పరిశీలించి, రిజిస్టర్ లో సంతకం చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఎలక్షన్ సూపరింటెండెంట్ అనురాధ భాయి, ఎలక్షన్ డి.టి. శ్యామ్, ఎలక్షన్ సిబ్బంది రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక:

అనంతరం జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఈ.వి.ఎం. గోదాము వెనుక కవిత కాలనీ ప్రక్కన ఉన్న 5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కొరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకునే విధంగా మలచుకోవాలి అని, క్రీడా ప్రాంగణం కొరకు స్థలం హద్దులను పరిశీలించి ఎంత మేరకు ఉపయోగంలోకి తీసుకోవచ్చు అనే వివరాలను పరిశీలించారు. మరికొన్ని

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి. ఓ. సన్యాసయ్య, మునిసిపల్ డి.ఈ. సి.హెచ్. ఉపేందర్, ఏ. ఈ. సురేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్, తదితరులు ఉన్నారు.


Share This Post