ఈ.వి.ఎం.ల భద్రత, పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండేలా భవనానికి భద్రత ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
గురువారం ఉదయం ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బస్టాండ్ సమీపంలో గల ఈ వీ ఎo గోదాము ను సందర్శించి పరిశీలించారు.
గోదాము తెరిచి లోపల భవనాన్ని పరిశీలించారు. గోదాము ముందు ఆవరణలో సి సి కెమెరాలు భద్రతకు కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు సిద్ధం చేయాలన్నారు. ఈ తనిఖీలో ఎన్నికల సెక్షన్ అధికారి జగదీష్ తో కలిసి తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమం లో తహసీల్దార్ దానయ్య ,RI శ్రీనివాస్, సర్వేయర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.