ఈ.వి.యం గోదాముకు పటిష్ట భద్రత కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.

ఈ.వి.యం గోదాముకు పటిష్ట భద్రత కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు.  సోమవారం మధ్యాహ్నం ఇ.వి.యం గోదాం నెలవారి పరిశీలనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ.వి.యం. గోదామును పరిశీలించారు.  గోదాముకు వేసిన సీలు, తాళము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రిజిష్టర్ లో సంతకం చేశారు.  గోదాం భద్రతను ఇలాగే కట్టుదిట్టంగా కొనసాగించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.

బి.జే.పి పార్టీ ప్రతినిధి పి. సుధాకర్ రెడ్డి, సి. సెక్షన్ సూపరిండెంట్ తబితా, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post