ఈ శ్రమ్ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు ఉపయోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు జిల్లా
నవంబర్ 25 (గురువారం)

ఈ శ్రమ్ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు ఉపయోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఈ- శ్రమ్ పథకాన్ని అసంఘటిత రంగకార్మికులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కల్లెకర్ మాట్లాడుతూ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా డిశంబర్ 31వ తేదీ వరకు ఉచితం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. వ్య వసాయం మరియు వ్యవసాయ అనుబంధ ఉపాధి రంగాలలో పనిచేసే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పని వారు, నర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్య వసాయదారులు, మత్స్యకారులు, భవన నిర్మాణం మరియు దాని అనుబంధ రంగాల్లో పనిచేసే వారు, తాపీ మేస్త్రి , తవ్వకం, రాళ్లు కొట్టే పని, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, పె యింటర్స్, ఇటుక బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్సర్లు, బావుల తవ్వడం/ పూడిక తీయడం తదితర పనులను చేసేవారు మరియు ఆటో, లారీ డ్రైవర్లు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, దినసరి కూలీలు, వలస కూలీలు, వీధి వ్యాపారులు తది తరులు నమోదు చేసుకోవచ్చన్నా రు. 16 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేనివారు, ఆదాయం పన్ను చెల్లించని వారు మాత్రమే అర్హులన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ- శ్రమ్ పథకంలో నమోదు చేసుకున్న ప్రతీ కార్మికునికి ఏడాది పాటు ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణం సంభవించిన లేదా పూర్తి అంగవైకల్యం కలిగిన 2లక్షల రూపాయల ప్రమాద బీమా, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం కలిగితే ఒక లక్ష రూపాయల బీమా కల్పిస్తారని అన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి 12 అంకెలు గల యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కార్డును ఇస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఇదివరకే రిజిస్టర్ చేసుకున్న అసంఘటిత కార్మికులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఐడి కార్డ్ పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ డేటాబేస్ ని ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకం కు ఈ కార్డు వర్తింపజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులుఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ప్రేమలత,EDM దేవేందర్, , సిఎస్సీ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మీసేవ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు

…………………………………….

Share This Post