ఈ శ్రమ్ పోర్టల్ నమోదు పై వీసి నిర్వహించిన జిల్లా కలెక్టర్


ఈ-శ్రమ్ పోర్టల్ లో అర్హులైన ప్రతి కార్మికుని నమోదు చేయాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి నవంబర్ 16:- ఈ-శ్రమ్ పోర్టల్ లో అర్హులైన ప్రతి అసంఘటిత కార్మికున్ని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో కార్మికుల నమోదు అంశంపై కలెక్టర్ మంగళవారం జిల్లా అధికారులు ,ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసంఘటిత కార్మికులకు భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ తెలిపారు. ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న ప్రతి అసంఘటిత రంగ కార్మికులకు మరణం/శాశ్వత అంగవైకల్యానికి రూ.2 లక్షల బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ సదుపాయం లేని వారు, ఆదాయపు పన్ను చెల్లించని వారు, 18-59 సంవత్సరాల వయసు లోపు అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకానికి అర్హులని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయం మరియు అనుబంధ ఉపాధుల పని చేసే చిన్న సన్నకారు రైతులు, ఉపాధి హామీ కూలీలు, మత్స్యకారులు పాడి పరిశ్రమ, కుల వృత్తుల వాళ్ళు, ఇటుక సున్నం బట్టి లో పని చేసేవారు, ఎలక్ట్రీషియన్స్, టైలరింగ్ ఆటోమొబైల్ స్వయం ఉపాధి, సేవా రంగంలో పని చేసేవారు స్వయం సహాయక సంఘాలు విద్యావాలంటీర్లు మొదలైన అన్ని అసంఘటిత వర్గాల కార్మికులు అర్హులని తెలిపారు. అసంఘటిత కార్మికులు eshram.gov.in అనే వెబ్ సైట్ లో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మానవతా దృక్పథంతో జిల్లా అధికారులంతా వారి పరిధిలో పని చేసే ప్రతి అసంఘటిత కార్మికుల వివరాలను ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు జిల్లాలో జాబ్ కార్డు కల్గి ఉన్న ప్రతి ఉపాధి హామీ కార్మికులను,గ్రామ పంచాయతీ లో పని చేసే మల్టీ పర్పస్ వర్కర్లు ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలని ఎంపీడీవో లను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని మార్కెట్ లో చిన్న వ్యాపారుల, వీధి వ్యాపారులను ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు.జిల్లాలోని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు,గోర్రెల సంఘాల సభ్యులు, మత్స్యకారులు, కులవృత్తిదారులు, మధ్యాహ్నం భోజనం కార్మికులందరు ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధించిన అధికారులను ఆదేశించారు. జిల్లా వెబ్ సైట్ లో ఈ శ్రమ్ పోర్టల్ సంబంధించిన వివరాలు అప్ లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు

జిల్లా కార్మికుల అధికారి రాజలింగం, ఈడీఎం కవిత, జిల్లా అధికారులు, ఎంపీడీవో లు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.

Share This Post