ఈ – సహకార సేవ ద్వారా సంఘం లను రిజిస్ట్రేషన్ :: జిల్లా సహకార అధికారి ఎన్.శ్రీనివాస రావు.

జులై 30, 2021ఆదిలాబాదు:-

            సహకార సేవ ద్వారా సంఘం లను రిజిస్ట్రేషన్ :: జిల్లా సహకార అధికారి ఎన్.శ్రీనివాస రావు.

 

సహకార సేవ ద్వారా సంఘములను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా సహకార అధికారి ఎన్.శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 న సహకార సంఘాల కమీషనర్ ఈ-సహకార సేవ వెబ్ సైట్ ను ప్రారంభించారని తెలిపారు. సంఘాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగినట్లు ఆయన తెలిపారు. సహకార సంఘముల చట్టం -1964, పరస్పర సహాయ సహకార సంఘముల చట్టం-1995 ప్రకారం నూతన సంఘములను రిజిస్ట్రేషన్ లను ఈ – సహకార సేవ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు http://esahakaraseva.telangana.gov.in  ద్వారా చేసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

 

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post