ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి* – *శాంపిల్స్ పారదర్శకంగా నమోదు చేయాలి* – *క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి*   – *శాంపిల్స్ పారదర్శకంగా నమోదు చేయాలి*  – *క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

*ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి*

– *శాంపిల్స్ పారదర్శకంగా నమోదు చేయాలి*

– *క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి*

ఈ- హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని
పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ గంభీరావు పేట మండలం కొత్తపల్లి, శ్రీ గాథ గ్రామంలో పర్యటించి ఈ- హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చేపడుతున్న రక్త నమూనాల సేకరణ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని చేపట్టిందని దీనికోసం రాజన్న సిరిసిల్ల జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా శాంపిల్ కలెక్షన్ సేకరించాలని, ప్రతీ రిపోర్ట్ ను
పారదర్శకంగా నమోదు చేయాలనీ అన్నారు.
18 సంవత్సరాలు నిండిన వారి నుండి రక్త నమూనాలు సేకరించిన అనంతరం ఆ శాంపిల్ ను జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కు పంపించడం జరుగుతుందని, పరీక్షలు చేసిన తర్వాత తుది ఫలితాలు ఈ-హెల్త్ ప్రొఫైల్ లో పొందుపరచిన అనంతరం ప్రతీ వ్యక్తికీ ఒక డిజిటల్ కార్డును అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

——————————–
*అంగన్వాడీ కేంద్రాల తనిఖీ*

*కేంద్రాల్లోని సౌకర్యాల తీరుపై ఆరా…*
——————————–
మంగళవారం గంభీరావుపేట మండల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి కొత్తపెల్లి, రాజుపేట, శ్రీగాధ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేశారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాల తీరును పరిశీలించారు.
ఎంతమంది చిన్నారులు, గర్భిణీలకు, బాలింతలు నమోదయ్యారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నమోదైన చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్ఠికాహారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. మెనూ ప్రకారం క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందించాలని ఆదేశించారు. పోషణ లోపం, తక్కువ బరువు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా శిశు, సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.

——————————-
*మొక్కలు ఎండా యో….*
*ఉద్యోగం ఊడినట్లే*

– *జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి హెచ్చరిక*

– *కొత్తపల్లీ, శ్రీ గాధ గ్రామాల్లో మొక్కల సంరక్షణలో అధికారుల వైఫల్యం*

– *కొత్తపల్లి పంచాయితీ సెక్రటరీ సస్పెండ్
– గంభీ రావు పేట MPO, శ్రీ గాధ సెక్రటరీ లకు ఛార్జ్ మెమోలు*

——————————–
*మొక్కలు ఎండా యో….*
*ఉద్యోగం ఊడినట్లే*నని జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి హెచ్చరించారు.

మంగళవారం ఆయన గంభీరావు పేట మండలం కొత్తపల్లి, శ్రీ గాథ గ్రామంలో DPO రవీందర్ తో కలసి ఎవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.

కొత్తపల్లి లో ఎవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోవడం, వాటి రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ పంచాయితీ సెక్రటరీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరిత హరం క్రింద ఎవెన్యూ ప్లాంటేషన్ లో
భాగంగా నాటిన మొక్కల సంరక్షణలో విఫలమైన పంచాయితీ సెక్రటరీ నీ సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ DPO రవీందర్ ను ఆదేశించారు. శ్రిగాధ గ్రామంలో కూడ ఎవెన్యూ ప్లాంటేషన్ ఆశించిన మేర లేదని సెక్రెటరీ కి చార్జీ మెమో జారీ చేయాల్సిందిగా సూచించారు.
గంభీరావు పేట మండలంలో హరిత హరం క్రింద నాటిన మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న మండల పంచాయితీ అధికారి కి సైతం చార్జీ మెమో జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..
మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని క్షేత్ర అధికారులను ఆదేశించారు.

వేసవి కాలంలో నీరు లేక చాలా వరకు మొక్కలు ఎండిపోతుంటాయని, వాటి కి నీటిని అందించి రక్షించాలని సూచించారు.

ఇకనుంచి తాను తరచుగా గ్రామాల్లో పర్యటిస్తూ… క్షేత్ర స్థాయిలో మొక్కల సంరక్షణకు తీసుకున్న చర్యలను స్వయంగా పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఏప్రిల్ , మే లలో ఎండల తీవ్రత అధికంగా
ఉన్నందున మొక్కలను బ్రతికించుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.

Dpo, drdo లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ…
మొక్కల సంరక్షణ చర్యలను పర్యవేక్షణ చేయాలన్నారు.

హరిత మొక్కల సంరక్షణ లో నిర్లక్ష్యం చేస్తే బాధ్యుల పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, రాజన్న సిరిసిల్లచే జారిచేయనైనది.

Share This Post