ఉచిత నైపుణ్య శిక్షణను వినియోగించుకోవాలి…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

ఉచిత నైపుణ్య శిక్షణను వినియోగించుకోవాలి…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ-సేర్ఫ్ మరియు తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం క్రింద ఉపాధి నైపుణ్య శిక్షణ నిచ్చి , సంబంధిత రంగంలో ఉపాధి కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 3 నుండి ఇంగ్లీష్ వర్క్ రెడీ నెస్ అండ్ కంప్యూటర్ కోర్స్ నందు మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ అనంతరం సంబంధిత రంగంలో అభ్యర్థులకు ఉద్యోగం చూపించడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత హాస్టల్, భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారని తెలిపారు.

ఇంగ్లీష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్ కోర్స్ శిక్షణలో భాగంగా కంప్యూటర్ నైపుణ్యత, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ ,పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, అర్థమెటిక్, హిందీ, గ్రూమింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ లో శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు.

పదవ తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్ ఆపై విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు 19 నుండి 26 సంవత్సరాల వయస్కులు అర్హులన్నారు.

ఆసక్తి ,అర్హత గల వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్స్, రేషన్ కార్డు జిరాక్స్, 4 పాస్ ఫోటో లతో ఈ నెల 3న సంగారెడ్డి బైపాస్ రోడ్డు లోని బిఎస్ఎన్ఎల్ పక్కన గల పాత డిఆర్డిఏ (వెలుగు ఆఫీస్) ఆఫీస్ కు నేరుగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Post