ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ సారధ్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి : రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి రేణుక

వార్త ప్రచురణ
ములుగు జిల్లా:
నవంబర్-2, (మంగళవారం)

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సారధ్యంలో మంగళ వారం నాడు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి రేణుక పాల్గొని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అధిక అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ఆరు లక్షల 70 వేల గ్రామాల్లోని ప్రజలకు దేశ వ్యాప్తంగా 40 రోజుల పాటు అవగాహనా కార్యక్రమాలకు ప్రణాళికా సిద్దం చేసారని రాష్ట్ర  అవగాహన కార్యక్రమాలు నిర్వహించుటకు  నవంబరు 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ సారధ్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారాని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లకి వారి యంత్రాంగానికి జిల్లా ప్రజల పట్ల సత్ సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు వ్యాక్సినేషన్ ముందుకు వెళుతుందని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధానం లో ఎంతో కృతనిశ్చయంతో ప్రణాళికాబద్ధంగా ప్రజల వద్దకు వెళుతున్నాయని అలాగే న్యాయ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించడం లో జిల్లా కలెక్టర్ల సహకారం అవసరమని వారు అన్నారు

జిల్లా కలెక్టర్ల కి వారి యంత్రాంగానికి జిల్లా ప్రజల పట్ల సత్ సంబంధాలు ఉండడం వల్ల ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ముందుకు వెళుతుందని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధానం లో ఎంతో కృతనిశ్చయంతో ప్రణాళికాబద్ధంగా ప్రజల వద్దకు వెళ్తున్నాయని, అదేవిధంగా న్యాయ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమం నిర్వహించడం లో జిల్లా కలెక్టర్లలు వారియంత్రాంగం సహకారం అవసరమని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య పాల్గొని, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గారు చెప్పినట్లు జిల్లాలోని 9 మండలాల ప్రజలు న్యాయ వ్యవస్థ పై అవగాహన కల్పించుట లో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, డిఆర్ఓ రమాదేవి, అడిషనల్ ఎస్పి రూపేష్, డి డబ్ల్యూ ఓ ప్రేమలత, డి ఎం&హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్, బీసీ కార్పొరేషన్ అధికారి ఎస్. లక్ష్మణ్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

 

 

Share This Post