ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 02, 2021ఆదిలాబాదు:-

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో నిరంతర పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామంలోని కొలామ్ గూడ లో ఉచిత వైద్య శిబిరం ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో ప్రతిరోజు పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జ్వరాలను అరికట్టవచ్చని అన్నారు. వర్షాకాలంలో నాలీల మురికి నీటిని తొలగించాలని, గ్రామంలో నీటి నిల్వలు ఉండకుండా ప్రతిరోజు పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని అన్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుంటూ పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గ్రామస్తులు ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. జ్వరాలు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరచాలని సూచించారు. వైద్య సేవలకు అందుబాటులో ఉంచిన మందులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, స్థానిక సర్పంచ్, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post