ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం—-1

తేదీ.07.5.2022

ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి. రవి

జగిత్యాల/ ధర్మపురి- మే, 07:- జిల్లాలోని నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేఎందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి విద్యార్థులకు సూచించారు. ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు ధర్మపురిలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ శనివారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నియామకాలు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పేదల ఉద్యోగార్థులకు నాణ్యమైన శిక్షణ ఉచితంగా అందించేందుకు వివిధ శాఖల ద్వారా మరియు మంత్రి గారి ప్రత్యేక చొరవ తో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 16 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, జిల్లాలో 250 మంది అర్హులైన నిరుపేదలకు ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ మరియు ఎస్పి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత, ప్రత్యేక తరగతుల శిక్షణ భోజనంతో సహ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎస్సీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కేవలం ఎస్సీ ఉద్యోగులకు గ్రూప్స్ పరీక్షలు రాయడానికి సన్నద్ధం అయ్యే దిశగా ఫౌండేషన్ కోర్సు (గ్రూప్ 1,2,3,4) ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో కూర్చుని కేంద్రాల్లో అందించే స్థాయిలో నాణ్యమైన పూర్తిగా జగిత్యాల జిల్లాలో అర్హులైన పేదలకు ఉచితంగా కల్పిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, 3 నెలల పాటు పూర్తి శ్రద్ధతో చదువుపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆలోచనల్లో కచ్చితత్వం ఉండాలని, ప్రతి పరీక్షకు హాజరయ్యే విధానం కాకుండా, ఒక పరీక్ష ఎంపిక చేసుకొని, దాని సిలబస్ పై అవగాహన చేసుకొని బాగా సన్నద్ధమై పరీక్షకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.

ఇంటి వద్ద చదువుకోడానికి ఇబ్బంది ఉన్న యువత కోసం అవసరమైతే వసతి సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ప్రతి రోజు 4 గంటలు చదువుకోవడానికి, మిగిలిన సమయం పునరుచ్చరణ, రాయడం, పేపర్ ప్రజెంటేషన్ పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు వ్యత్యాసంగా ఉంటాయని, దానికి తగిన విధంగా మనం సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.

గ్రూప్ పరీక్షల్లో అభ్యర్థులు ఎంపిక పూర్తి పారదర్శకంగా రాత పరీక్ష ద్వారా జరుగుతుందని, ఇంటర్ జిల్లాలో ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు సన్నద్ధమవుతున్న సమయంలో సెల్ ఫోన్ వినియోగం స్నేహితులతో సమయం గడపడం పూర్తిస్థాయిలో తగ్గించాలని సూచించారు.

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న 6 నెలల నుంచి ఏడాది సమయం చాలా విలువైందని, ఈ సమయాన్ని చాకచక్యంగా వినియోగించుకోవడం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, బి.సి.వెల్ఫేర్ అధికారి సాయిబాబా మున్సిపల్ ఛైర్పెర్సన్ సత్తెమ్మ, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తాసిల్దార్ వెంకటేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

ప్రచురణార్థం----1 తేదీ.07.5.2022 ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి. రవి జగిత్యాల/ ధర్మపురి- మే, 07:- జిల్లాలోని నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేఎందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి విద్యార్థులకు సూచించారు. ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు ధర్మపురిలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నియామకాలు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లాలో పేదల ఉద్యోగార్థులకు నాణ్యమైన శిక్షణ ఉచితంగా అందించేందుకు వివిధ శాఖల ద్వారా మరియు మంత్రి గారి ప్రత్యేక చొరవ తో ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 16 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని, జిల్లాలో 250 మంది అర్హులైన నిరుపేదలకు ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ మరియు ఎస్పి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత, ప్రత్యేక తరగతుల శిక్షణ భోజనంతో సహ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఎస్సీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కేవలం ఎస్సీ ఉద్యోగులకు గ్రూప్స్ పరీక్షలు రాయడానికి సన్నద్ధం అయ్యే దిశగా ఫౌండేషన్ కోర్సు (గ్రూప్ 1,2,3,4) ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ లో కూర్చుని కేంద్రాల్లో అందించే స్థాయిలో నాణ్యమైన పూర్తిగా జగిత్యాల జిల్లాలో అర్హులైన పేదలకు ఉచితంగా కల్పిస్తున్నామని అన్నారు.  ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, 3 నెలల పాటు పూర్తి శ్రద్ధతో చదువుపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల ఆలోచనల్లో కచ్చితత్వం ఉండాలని, ప్రతి పరీక్షకు హాజరయ్యే విధానం కాకుండా, ఒక పరీక్ష ఎంపిక చేసుకొని, దాని సిలబస్ పై అవగాహన చేసుకొని బాగా సన్నద్ధమై పరీక్షకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.  ఇంటి వద్ద చదువుకోడానికి ఇబ్బంది ఉన్న యువత కోసం అవసరమైతే వసతి సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ప్రతి రోజు 4 గంటలు చదువుకోవడానికి, మిగిలిన సమయం పునరుచ్చరణ, రాయడం, పేపర్ ప్రజెంటేషన్ పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు వ్యత్యాసంగా ఉంటాయని, దానికి తగిన విధంగా మనం సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. గ్రూప్ పరీక్షల్లో అభ్యర్థులు ఎంపిక పూర్తి పారదర్శకంగా రాత పరీక్ష ద్వారా జరుగుతుందని, ఇంటర్ జిల్లాలో ప్రభుత్వం రద్దు చేసిందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు సన్నద్ధమవుతున్న సమయంలో సెల్ ఫోన్ వినియోగం స్నేహితులతో సమయం గడపడం పూర్తిస్థాయిలో తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న 6 నెలల నుంచి ఏడాది సమయం చాలా విలువైందని, ఈ సమయాన్ని చాకచక్యంగా వినియోగించుకోవడం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, బి.సి.వెల్ఫేర్ అధికారి సాయిబాబా మున్సిపల్ ఛైర్పెర్సన్ సత్తెమ్మ, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తాసిల్దార్ వెంకటేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.  జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.
ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post