ఉజ్జ్వల భారతదేశం ఉజ్జ్వల భవిషత్తు పవర్ @ 2047 విద్యుత్ మహోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

విద్యుత్ ప్రాముఖ్యతను గుర్తించి భవిష్యత్ తరాలకు అందివ్వాలి

విద్యుత్ పొదుపు చర్యల పై అవగాహన కల్పించాలి

విద్యార్థులు విద్యుత్ ఉత్పత్తి, ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

దేశం అభివృద్ధి పథంలో వెళ్లాలంటే యాంత్రీకరణ తోపాటు విద్యుదీకరణ ప్రాముఖ్యత, ఆదా చేయడం అలవర్చుకోని కర్బన ఉద్గారాలను తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వాడుకొని భవిష్యత్ తరాలకు మంచి ఫలాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

ఆజాదీ అమృత్ వారోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శనంలో ఎన్టీపీసీ రామగుండం టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉజ్జ్వల భారత్ ఉజ్జ్వాల భవిష్యత్ @ 2047 విద్యుత్ మహోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 6000 మెగావాట్లు ఉన్న విద్యుత్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 16300మెగావాట్లకు ఉత్పాదన పెరిగిందన్నారు. మానవ శరీరంలో రక్తం లేకుండా అవయాలు పనిచేయవొ అలాగే ఎలక్ట్రిసిటీ లేకుండా ఏమి చేయలేమని అన్నారు. రాష్ట్రం మరియు దేశం విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను, దేశం మరింత అభివృద్ధి పథంలో వెళ్లాలంటే యాంత్రీకరణ తోపాటు విద్యుదీకరణ యొక్క ప్రాముఖ్యతను తెలుసు కోవాలన్నారు. విద్యుత్ ఆదా చేయడం అలవర్చుకోవాలని అన్నారు. తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరులను వాడుకుని భవిష్యత్ తరాలకు అందివ్వాలని అన్నారు. విద్యుత్ పొదుపు చర్యల పై అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది, విద్యుత్ ప్రాముఖ్యత గురించి అనుభవజ్ఞులైన వారి ద్వారా విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.

ఎన్టీపీసీ జనరల్ మేనేజర్( మెయింటెనెన్స్) అలోక్ ఠాకూర్ మాట్లాడుతూ ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా 25 జూలై నుండి 30 జూలై వరకు దేశంలోని 773 జిల్లాలలో ఉగాది, దుర్గా పూజ, దీపావళి పండగ వాతావరణంలో విద్యుత్ వారోత్సవాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఎన్టీపీసీ, టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో ఉజ్వల్ భారత్ ఉజ్వల్ భవిష్యత్ @2047 విద్యుత్ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ లేకుండా పురోగతి సాధ్యం కాదని అన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఉన్న మనదేశంలో నేడు 403 గీగా వాట్స్(4 లక్షల మెగావాట్లు) విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు.2030నాటికి 500గీగా వాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యమన్నారు.

ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రం రాక ముందు అంధకారంలో ఉన్న తెలంగాణ నేడు అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎలక్ట్రిసిటీ సంస్థ ఎండి ప్రభాకర్ రావు లదే అన్నారు కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ రంగానికి లక్ష కనెక్షన్లు ఇవ్వాలన్న మైలురాయిని దాటడం జరిగిందన్నారు. జిల్లాలో 2 సబ్ స్టేషన్ లకు గంగాధర మండలంలో ఒద్యారం, కరీంనగర్ మండలంలోని ఖాజీపూర్ గ్రామంలో సబ్స్టేషన్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ స్థలం కేటాయించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో కిట్స్, విట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రాముఖ్యత, ఆదా పై నాటక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు ప్రేమ్ రెడ్డి, సోమ్లా భూక్యా, విద్యుత్శాఖ డీఈలు, ఎ ఈలు, కిట్స్, విట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post