ఉత్తమ ఫలితాల సాధనకై కృషి చేయాలి :కలెక్టర్ యస్ వెంకట్రావు

తేదీ.24.2.2023.
సూర్యాపేట.

ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి.

జిల్లా కలెక్టర్ వెంకట్రావు.

పదో తరగతి లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల విద్యాధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారం స్నాక్స్ అందజేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యార్థులను స్థాయి వారీగా అలాగే గ్రూపులుగా విభజించి వారిపై ప్రత్యేక శ్రద్ధను చూపాలని సూచించారు విద్యార్థులకు మానసిక వికాస తరగతులను నిర్వహించి వారిలో పరీక్షల పట్ల ఉన్న భయాందోళన తొలగించాలని అన్నారు. తరచుగా తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి వారికి తగిన సూచనలు చేసి విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదువుకునే సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో deo అశోక్, ఎడి శైలజ, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post