*ఉత్తమ యువజన సంఘం అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం*

భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వశాఖ నెహ్రూ యువ కేంద్ర నల్లగొండ జిల్లా పరిధిలోని ఉత్తమ యువజన సంఘం, మహిళ మండలిలకు 2020 – 21 సంవత్సరామునకు అందించే అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యూత్ ఆఫీసర్  ప్రవీణ్ సింగ్ గారు సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రంలో అనుసందనమైన యువజన సంఘాలు వారు 18 నుండి 29 సంవత్సరాలలోపు వయసు కలిగిన యువతి యువకులు ఉండాలని. సంఘం రిజిస్టర్ కలిగి ఉండాలన్నారు. 01 ఏప్రిల్ 2020 నుండి 31 మార్చి 2021 వరకు నిర్వహించిన కార్యక్రమాలు. ఫోటోలు. పత్రిక ప్రచురణలు.  2020-21 సంవత్సరం ఆడిట్ నివేదిక దరఖాస్తును జత చేసి 15 నవంబర్ 2021 వ తేదీలోగా దరఖాస్తు నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన యువజన సంఘానికి రూ. 25 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నాట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9052798602 నంబర్ ను లేదా నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Share This Post