ఉత్తమ సేవలు/విధులు నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఉత్తమ సేవలు/విధులు నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఉత్తమ సేవలు/విధులు నిర్వహించాలి ::  జిల్లా కలెక్టర్ జి. రవి

  జగిత్యాల, జూలై 30: ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకొని విధి నిర్వహణలో ఎటువంటి పోరపాట్లు లేకుండా సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలు అందించాలని  జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా 14 అంగన్ వాడి  టీచర్లు, 68 అంగన్ వాడి ఆయా పోస్టులకు నోటిఫికేషన్ జారిచేయగా, దరఖాస్తు చేసుకున్న అర్హులైన 6 అంగన్ వాడి  టీచర్లు, 18 అంగన్ వాడి ఆయాలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా నియామక పత్రాలను అందజేయడం జరిగింది.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వంత గ్రామంలో, స్వంత వార్డులో తెలిసిన వారి మద్య ఉద్యోగం చేయడాన్ని ఒక గోప్ప వరంగా భావించాలని, ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకొని ఎలాంటి పోరపాట్లకు తావు లేకుండా శాఖ పరంగా ప్రభుత్వం చేపట్టే  పథకాలను లబ్దిదారులకు సక్రమంగా అందజేయడంలో ముందుండాలని సూచించారు.

ఉత్తమ సేవలు/విధులు నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఈ కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళా మరియ వయోవృద్దుల సంక్షేమ అధికారి నరేష్,  జిల్లా వైద్యఆరోగ్యశాడ అధికారి  డా. శ్రీధర్,  సిడిపిఓలు,  సూపర్ వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post