ఉత్తేజం కలిగించే సాధనమే కవిత్వం మంచి కవిత్వం , పాట మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది కళలు సాహిత్యాన్ని ఆదరించాలి …….. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

ఉత్తేజం కలిగించే సాధనమే కవిత్వం

మంచి కవిత్వం , పాట మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది

కళలు సాహిత్యాన్ని ఆదరించాలి
…….. అదనపు కలెక్టర్ వీరారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కళలు, సాహిత్యానికి అత్యంత ఆదరణ లభిస్తుందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం కవులను, కళాకారులను, రచయితలను ప్రోత్సహిస్తూ సాహిత్యానికి, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి రూపంగా నిలిచిందన్నారు. జిల్లాలో గొప్ప గొప్ప కవులు ఉన్నారని, కవులు ఉన్నచోట శుభ సంతోషకర సమాజం వెల్లి విరుస్తుందని పేర్కొన్నారు.

మరింతగా కళలు, సాహిత్యాన్ని ఆదరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మంచి కవిత్వం ,పాట వింటే మనసుకు ఉల్లాసం కలుగుతుందన్నారు. మనిషికి ఉత్తేజాన్ని కలిగించే సాధనమే కవిత్వమని అన్నారు.

తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో 37 మంది కవులు పాల్గొని తెలంగాణ సంస్కృతిని ఔన్నత్యాన్ని చాటిచెప్పే విధంగా తమ కవితలతో శ్రోతలను అలరించారు. తెలుగు, హిందీ ,ఉర్దూ భాషలలో కవులు తమ కవితలను వినిపించారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారి నగేష్ కవులను శాలువాతో సన్మానించి మెమొంటో లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి నగేష్, బోర పట్ల హనుమంతాచార్యులు, మోహన్ కుమార్ గాంధీ, కవులు, కవయిత్రులు, వివిధ శాఖల ఉద్యోగులు,ప్రజలు పాల్గొన్నారు.

Share This Post