*ఉదయం సముద్రం ఎత్తి పోతల పథకం కెనాల్స్ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలి*: అదనపు కలెక్టర్(రెవెన్యూ)వి.చంద్ర శేఖర్

నల్గొండ,సెప్టెంబర్ 24.ఉదయం సముద్రం  ఎత్తిపోతల పథకం కెనాల్స్ కు భూ సేకరణ  త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ)వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు.  గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో  జిల్లాలో నిర్మిస్తున్న ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ భూ సేకరణ పూర్తి చేసినట్లు,కెనాల్స్ తవ్వకం సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు 3851 కరాలకు గాను 1486 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేసినట్లు,ఇంకా 900 ఎకరాలకు రిక్విజిషన్ కు ప్రతి పాదనలు సమర్పించ నున్నట్లు ఏ.యం.ఆర్.పి.ఈ. ఈ. బుచ్చి రెడ్డి తెలిపారు.జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే ఈ పథకం  సంబంధించి నల్గొండ,నార్కట్ పల్లి,చిట్యాల,కట్టం గూర్, మునుగోడు మండలంల లో భూ సేకరణకు, రెవెన్యూ,అటవీ,ఏ.యం.ఆర్.పి.,ఆర్&బి అధికారులు సమన్వయంతో పని చేయాలని,సర్వే,అవారర్డ్ పాస్ చేసి భూ సేకరణ చేసిన రైతులకు నష్ట పరిహారం చెల్లింపు వేగవంతం చేయాలని,భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చేసినప్పటికీ నష
ఈ సమావేశంలో నల్గొండ డి. ఆర్.ఓ. జగదీశ్వర్ రెడ్డి ,ఆర్&బి ఈ ఈ నరేందర్,ఏ.యం.ఆర్.పి.ఈ .బుచ్చిరెడ్డి , తహసిల్దారులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share This Post