ఉద్యమ స్పూర్తితో వందశాతం వ్యాక్సిన్ అందజేసే లక్ష్యంగా దృష్టి సారిద్దాం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

ప్రచురణార్థం-1 తేది 27-10-2021
ఉద్యమ స్పూర్తితో వందశాతం వ్యాక్సిన్ అందజేసే లక్ష్యంగా దృష్టి సారిద్దాం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత
జగిత్యాల, అక్టోబర్ 27: జిల్లాలో వందశాతం వ్యాక్సిన్ అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యమస్పూర్తితో ముందుకు సాగాలని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత అన్నారు. బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్ కమీషనర్లు, మున్సిపల్ చైర్పర్సన్ లు, ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, యంపిడిఓలు, జట్పిటిసిలు, యంపిపి లు ఎఫ్.పి షాప్ డీలర్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇతర అధికారులతొ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రబావం లేకుండా నిర్బయంగా ప్రజలు బయట తిరిగేలా ప్రతి ఒక్కరికి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేసి రాష్ట్రంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పై అందరికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వలన ఎటువంటి ముప్పులేదని చెబుతూ ప్రజల్లో వ్యాక్సిన్ పై పూర్తి అవగాహనను కల్పించడంలో ప్రతిఒక్కరు బాగస్వాములు కావాలని అన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వృద్దులు మరియు ఇతర వ్యాదిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా వారివద్దకు వెళ్లి వ్యాక్సిన్ అందించాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎటువంటి అనారోగ్యాలకు గురికారని, కోవిడ్ పై గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయి అవగాహనను కలిగిఉండాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కోవిడ్ మొదటి, రెండవ డోసును ప్రతిఒక్కరు తీసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో కరోనా కారణంగా ఎదుర్కోంటున్న ఇబ్బందులు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. బతుకమ్మ, దసరా పండుగల కారణంగా నిర్దేశించిన మేర కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యాన్ని అధికారులు సాధించలేకపోయారని, పిహెచ్సి, గ్రామం వారిగా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారిని గుర్తించి, రెండవ డోస్ ఇవ్వాలని, ఓటరు జాబితా ఆదారంగా వ్యాక్సిన్ తీసుకోవలసిన, తీసుకున్న వారి వివరాలను సరిచూసుకోవాలని, ఓటరు జాబితాలో వివరాలు ఉండి మరో ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను, విదేశాలలో ఉన్న సుమారు 3500 మందికి సంబంధించిన వ్యాక్సినేషన్ వివరాలను తెలుసుకొవాలని, ప్రతి గ్రామం, వార్డు వారిగా తహసీల్దారు, యంపిడిఓ, యంపిఓ, ఆర్.ఐ, ఇంజనీరింగ్ సిబ్బంది, సిడిపిఓ, ఎపియం, ఎపిఓ లతో ప్రత్యేక అధికారులను మరియు ఆశా, గ్రామపంచాయితి సెక్రటరి, అంగన్ వాడి సెక్రటరి, టీచర్ మరియు విఆర్ఏ లతో మల్టిడిసిప్లినరీ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరందరు ప్రజాప్రతినిధుల సహాకారంతో డ్రైవ్ మోడ్ లో వ్యాక్సిన్ రెండు డోసులు చివరి వ్యక్తి వరకు చేరేలా చూడాలని ఆదేశించారు. మరికోద్ది రోజులలో పంట సేకరణ మొదలుకానున్న తరుణంలో టీం సభ్యులందరు అప్రమత్తమై దీపావలి పండుగ లోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చివరిదశకు చేరేలా కృషిచేయాలని అన్నారు. ఇంటింటి సర్వే ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వారి ఇంటికి స్టిక్కరింగ్ చేయాలని, ప్రతి సెంటర్ వారికి ప్రతిరోజు 100 మందికి వ్యాక్సిన్ అందించాలని, జిల్లాలో సుమారు 7300 గర్బీణిలు, 7200 బాలింతలు మరియు 9700 క్రానిక్ వ్యాదులతో బాదపడే వారికి వ్యాక్సిన్ అందివ్వాలని, వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, అన్ని రకాల వ్యాదిగ్రస్తులు నిర్బయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని, ప్రజల్లో ఇంకా ఎవైన అనుమానాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కు ఫోన్ చేసి వారి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని తెలియజేయాలని పేర్కోన్నారు.
వైద్యాధికారులు మెడికల్ సిబ్బందితో పాటు ఆర్ఎంపి లతో వ్యాక్సిన్ పై పూర్తిస్థాయిలో అవగాహనను కల్పించేలా అవగాహన సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల్లో నెలకోన్న బయాలను తొలగించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని, అవసరమైతే ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించాలని సూచించారు. జిల్లాలో సమృద్దిగా వ్యాక్సిన్ నిలువలు ఉన్నాయని, కేంద్రాలకు అవసరం మేర అధనంగా కూడా పంపిణి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ అవగాహనలో మహిళ సంఘాలతో పాటు స్వయం సహాయక బృందాల ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జిల్లా వైద్యాధికారి డా. పి. శ్రీధర్, ఉప వైద్యాధికారి డా. జైపాల్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారి సమీయెద్దిన్ మరియ ప్రత్యేకాధికారులు రామానుజాచారి, సుందరవరదరాజన్ తదితరలు పాల్గోన్నారు.

ఉద్యమ స్పూర్తితో వందశాతం వ్యాక్సిన్ అందజేసే లక్ష్యంగా దృష్టి సారిద్దాం :: జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post