ఉద్యాన పంటలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కార్యక్రమం : జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్

పత్రికా ప్రకటన,   తేది:29.11.2021, వనపర్తి.

ఉద్యాన పంటలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ తెలిపారు.
సోమవారం ఉద్యాన కళాశాలలో ప్రభుత్వ పథకాలపై రైతులకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కమతాలలో అధిక ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, ప్రస్తుతం మార్కెట్లో గిట్టుబాటు ధరతో పాటు మంచి డిమాండ్ ఉందని, మోజెర్లలోని ఉద్యాన కళాశాల శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు వివరించారు. కూరగాయల నారుతో మొదలుకొని, పండ్లు తోటల విస్తరణతో సహా బిందు, తుంపర సేద్యాలకు ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చి, ఉద్యాన రంగాన్ని ప్రోత్సహిస్తోందని వారు వివరించారు. ఈ మేరకు ఉద్యాన కళాశాల, మోజెర్లలో షెడ్యూల్డు కులాల ఉప ప్రణాళికలో భాగంగా రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్,  మండల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీకాంత్, రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, సబ్సిడీల గురించి సవివరంగా తెలియజేసారు. కళాశాల అసోసియేట్ డీన్ ఇన్ఛార్జి డాక్టర్ పిడిగెం సైదయ్య వరికి ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పండ్లు పూల తోటల గురించి రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు డా॥ కళాధర్ బాబు జిల్లాలో పూలు, పండ్లు తోటల పెంపకం గురించి, కూరగాయల సాగు, కూరగాయల సాగులో మెళకువలు, సాగు ఆవశ్యకత గురించి శాస్త్రవేత్త నాగరాజు వివరించారు. డా|శ్రీనివాస్ సుగంధ పంటల పెంపకం గురించి, చంద్రశేఖర్ భూసార పరీక్షల ఆవశ్యక గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, పెడ్డమండడి మండలం మోజర్ల, మద్ది గట్ల గ్రామాల షెడ్యూల్ కులాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post