ఉద్యాన పంటలు వేసుకుని అధిక లాభాలు గడించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలి ::కలెక్టర్ బి. గోపి

గురువారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మరియు నర్సంపేట మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు.

ముందుగా నల్లబెల్లి మండలంలోని అరిసెనపెళ్లి గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోట వేసిన పంటను కలెక్టర్ పరిశీలించారు.

పంట కు సంబంధించి రైతు శేఖర్ ఆచారి ని వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ తోటలో పండిన డ్రాగన్ ఫ్రూట్ లను చూసి పంట బాగా వచ్చిందని .. ఇందుకు ఆ రైతు తీసుకున్న శ్రమ, శ్రద్దను అభినందించారు.

ఇలాగే జిల్లా లోని రైతులు ఉద్యాన పంటలు వేసుకునే విధంగా రైతులకు అవగాహన పరచాలని హార్టికల్చరల్ అధికారి శ్రీనివాస్ రావుకు కలెక్టర్ తెలిపారు.

అనంతరం నారకపేట గ్రామంలో జరుగుతున్న ఈజీఎస్ పనులను కలెక్టర్ పరిశీలించారు.

చెట్లను నాటడమే కాదు వాటికి రక్షణ కల్పించిన విధానఁ చూసి ఉపాధి హామీ కూలీలను కలెక్టర్ మెచ్చుకున్నారు.

Share This Post