ఉద్యోగులందరు వ్యాక్సిన్ తీసుకోవాలి.

ప్రచురణార్ధం

మహబూబాబాద్, డిసెంబర్,6.

ఉద్యోగులందరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో కోవిడ్ -19వ్యాక్సిన్ పై జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో కోవిడ్ మొదటి డోస్ 94శాతం పూర్తి అయ్యిందని, అలాగే 2వ డోస్ 52 శాతం చేయడం జరిగిందన్నారు.

100 శాతం పూర్తి చేసేందుకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసినందున ఉద్యోగులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని, కుటుంబ సభ్యులకు వేయించాలని నిర్లక్ష్యం చేయరాదన్నారు.

మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.

మున్సిపాలిటీలలో, గ్రామపంచాయతీలలో మాస్క్ , సామాజికదూరం లపై విస్తృత ప్రచారం చేపట్టాలని, మాస్క్ ధరించకపోయినా, సామాజిక దూరం పాటించక పోయిన నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, జరిమానా విధించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్,కొమరయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
———————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…వారిచే జారిచేయనైనది.

Share This Post