ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ కార్యాలయములో ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్: నిఖిల

వంద రోజులు పని దినాలలో ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ మరియు జిల్లా కోర్టు కార్యాలయాలలో విడతల వారీగా ప్రత్యేక కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కలెక్టరేట్, ఎస్పీ, కోర్టు ఉద్యోగులందరూ కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ నిఖిల కోరారు. ఇట్టి శిబిరము ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు నిర్వహించబడును తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ కంటి పరీక్షలు గావించి కంటి అద్దాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, ఉప వైద్య శాఖ అధికారి జీవరాజ్, వైద్య బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post