ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన     తేది:28.12.2021, వనపర్తి.

కొత్త లోకల్ క్యాడర్ లకు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్త లోకల్ క్యాడర్ లకు ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు డిసెంబర్ 6 వ తేదీన జారీ చేసిన జి. ఓ. నెంబర్ 317ను అనుసరించి సీనియారిటీ ప్రకారం కేటాయించబడిన జిల్లా క్యాడర్ పోస్టుల జాబితాను తయారు చేసినట్లు ఆమె తెలిపారు.
ఉద్యోగుల కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టి, డిసెంబర్ చివరి నాటికి కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post