ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులు 317 అనుసరించి పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు

ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఉత్తర్వులు 317 అనుసరించి పారదర్శకంగా జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  మంగళవారం సాయంత్రం ప్రెసిడెన్షిల్ ఆర్డర్ 2018 అమలు విధి విధానాల పై జిల్లా కలెక్టర్లు, శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉద్యోగుల కేటాయింపులు 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా 7 జోన్ లు, రెండు మల్టీ జోన్ లుగా విభజించు కోవడం జరిగిందన్నారు.  ఈ తరుణంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు నిర్వహించేందుకు, భవిష్యత్తు లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను వారి సీనియారిటీ ఆధారంగా బదిలీలు సీనిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ ప్రక్రియలో ఎస్సి ఎస్టీలకు ప్రాధాన్యం తో పాటు, దివ్యంగులకు, భర్త చనిపోయిన అనంతరం కారుణ్య నియామకం పొందిన ఉద్యోగినులకు ప్రాధాన్యత ఇస్తూ అత్యంత పారదర్శకంగా ఉద్యోగుల కేటాయింపులు చేపట్టాలని సూచించారు.  ఇందుకు ముందుగా ప్రతి ప్రభుత్వ శాఖ నుండి ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు తీసుకోవడం, ప్రతి ఉద్యోగి నుండి ఆప్షన్ ఫారం తీసుకోవడం జరగాలని సూచించారు. ముందుగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను పకడ్బందీగా రూపొందించి అనంతరం ఆప్షన్ ల వారిగా బదిలీలు చేయాలని సూచించారు.  ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి   జిల్లాలు దాదాపు జిల్లా స్థాయి పోస్టుల బదిలీ ప్రక్రియ పూర్తి అయ్యిందని అందులో మహబూబ్ నగర్ జిల్లా సైతం ఉన్నట్లు పేర్కొన్నారు.  జోనల్ ,మల్టీ జోనల్ ఉద్యోగులు తమ ఆప్షన్ ఫారాలను తమ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లకు పంపించుకోవాలని సూచించారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఈ నెల 20 లోపల పూర్తి చేసి డిసెంబర్ 20వ తేదీన బదిలీ ఉత్తర్వులు ప్రభుత్వ వెబ్సైట్ నుండి జారీ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్డర్ చేతికి వచ్చిన 3 రోజుల్లో ఉద్యోగి తనకు కేటాయించిన జిల్లాకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలియజేసారు.  మొత్తం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో పాటు కొత్త జిల్లాల కలెక్టర్లు దగ్గరుండి పశృయ్సవేక్షించాలని తెలియజేసారు.

ఈ వీడియో కాన్ఫెరెన్సు లో ప్రత్యేక కార్యదర్శులు వికాస్ రాజ్, శివశంకర్, రామకృష్ణ , రోనాల్డ్ రోస్ తో పాటుగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డి హరిచందన, ఎస్పీ డా. చేతన, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఏవో నర్సింగ్ రావ్,అందరూ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post