ఉద్యోగుల విభజనను సత్వరమే పూర్తి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కల్లెక్టర్లను ఆదేశించారు.

మంగళవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హైదరాబాదు సచివాలయం నుండి ఉద్యోగుల విభజన, ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 317 పై దిశ నిర్దేశం చేశారు.  వివిధ జిల్లాలలో జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కల్లెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ  కలక్టర్ రేట్ కార్యాలయం నుండి కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా జాబితాలను రూపొందించామని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్య క్రమంలో ఇచ్చే ఆప్షన్ల వారీగా కేటాయించిన అనంతరం, వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకున్నామని తెలిపారు.  ఇందుకోసం స్క్రూటిని కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు జాబితా లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జిల్లా స్థాయి పోస్ట్ లను కేటాయించిన ట్లు తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు తొంభై శాతం కేటాయింపులు పూర్తి అయినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో పాటు, 70 శాతం కంటే ఎక్కువగా సమస్య ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులు, క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సంబంధిత ఉద్యోగులకు  ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.  సస్పెన్షన్‌, శిక్షణ, సెలవు, ఫారిన్‌ స.ర్వీస్‌, డిప్యుటేషన్‌లలో ఉన్నవారిని కూడా జాబితాలో  చేర్చామని తెలిపారు.
ఈ వీడియొ కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ బి గోపి , మునిసిపల్ కమీషనర్ ప్రావీణ్య , హనుమకొండ అదనపు కలెక్టర్ సంద్యారాణి , డి ఆర్ ఓ వాసుచేంద్ర , ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Share This Post