ఉద్యోగుల విభజన ప్రక్రియను నిర్దేశించిన గడువు ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ప్రచురణార్ధం

డిశంబరు 14, ఖమ్మం:

ఉద్యోగుల విభజన ప్రక్రియను నిర్దేశించిన గడువు ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియపై మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఉద్యోగుల విభజన ప్రక్రియపట్ల పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి క్యాడర్ల విభజనకు సంబంధించి ఉద్యోగుల నుండి ఆప్షన్ల స్వీకరణ ప్రక్రియను ఈ నెల 16 లోగా పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసి ఆప్షన్లు స్వీకరించి స్పెషల్ క్యాటగిరి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రాధాన్యతపరంగా కేటాయింపు జరిగేలా విభజన ప్రక్రియను చేపట్టాలని ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా విభజన ప్రక్రియ ద్వారా ఆప్షన్లననుసరించి జిల్లా స్థాయి కమిటీ సమావేశం ద్వారా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియను మొదలు పెట్టామని, దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి  రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్ – వ్యవస్థ – 2018, రాష్ట్ర ప్రభుత్వ ఉత్వర్వులు, మార్గదర్శకాలకనుగుణంగా జిల్లా స్థాయి ఉద్యోగుల విభజనకు ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించడం అదేవిధంగా ఉద్యోగుల నుండి ఆప్షన్లను స్వీకరించేందుకు జిల్లా స్థాయి అధికారులను ఇప్పటికే ఆదేశించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా జిల్లా స్థాయి క్యాడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్, అదనపు కలెక్టర్ ఎన్ మదుసూధన్, అడిషనల్ డి.సి. పిలు ఇంజరపు పూజ, గౌస్ ఆలం, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రవీణ, జిల్లా, పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Share This Post