ఉద్యోగుల విభజన ప్రక్రియపై బుధవారం వరకు అన్ని శాఖల అధికారులు జాబితా అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

మంగళవారం ఉద్యోగుల విభజన ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లుతో సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో విభజన ప్రక్రియపై  సమీక్ష నిర్వహించారు.  అన్ని శాఖల అధికారులు ప్రతి క్యాడర్ నుండి ప్రాధాన్యతను తెలియ చేస్తూ ఆప్షన్ ఫారాలు ఇవ్వాలని చెప్పారు.  డెప్యూటేషన్ లో ఉన్న సిబ్బంది వివరాలు సైతం ఇవ్వాలని చెప్పారు.  ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని, జాప్యం చేయడం వల్ల సిబ్బంది ఇబ్బంది పడతారని అందువల్ల అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించు కోవాలని చెప్పారు.  సాయంత్రం అన్ని శాఖల నుండి వచ్చిన జాభితాపై సమగ్ర నివేదికలు అందచేయాలని డిఆర్వో కు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ రంజిత్, డిఆర్వో అశోక్ చక్రవర్తి అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post