ఉద్యోగుల సాంస్కృతిక పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

ఉద్యోగుల సాంస్కృతిక పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

ఉద్యోగుల సాంస్కృతిక పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, ఏప్రిల్ – 23:

జిల్లా ఉద్యోగుల సాంస్కృతిక, క్రీడా పోటీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఐ.ఎం. ఏ. హాలులో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా స్వాగత గీతం పాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ, నిత్యం విధి నిర్వహణలో శ్రమించే ఉద్యోగులకు ఈ సాంస్కృతిక పోటీలు, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, ఉద్యోగుల్లో దాగి ఉన్న చిన్ననాటి కళలను ప్రదర్శించే అవకాశం వచ్చిందని అన్నారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమలో దాగి ఉన్న కళా ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. దీంతో కళా ప్రాంగణం మారు మ్రోగింది.

సాంస్కృతిక కార్యక్రమంలో సి.ఈ. ఓ. రమాదేవి, డిప్యూటీ సి. ఈ. ఓ. నర్మద, డి.అర్.డి. ఓ. పి.డి. సన్యాసయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాని, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, జిల్లా అధికారులు, సి.డి.పి. ఓ డేబోరా, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post