ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులపై వీడియో కాన్ఫరెన్స్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్

పత్రికా ప్రకటన
తేదీ. 14.12.2021
వనపర్తి జిల్లా.

ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ  ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.
ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై మంగళవారం రాత్రి అయన హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉద్యోగుల స్థానిక కేడర్  కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, ఉద్యోగుల నుండి తీసుకునే ఆప్షన్,  సీనియారిటీ ,ప్రాధాన్యతల జాబితా, కమిటీల సమావేశాలు ఆయా జిల్లాలకు కేటాయింపు మొత్తం ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేయాలని, అంతేకాక స్పెషల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతదితరులు ఈ విషయంపై పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష అదనపు. కలెక్టర్ డి.వేణుగోపాల్,   అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————–
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post