ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

ప్రచురణార్థం-2
జనగామ, డిశంబర్ 14: ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా. తప్పకుండా పాటిస్తూ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై మంగళవారం రాత్రి హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, ఉద్యోగుల నుండి తీసుకునే ఆప్షన్, సీనియారిటీ, ప్రాధాన్యతల జాబితా, కమిటీల సమావేశాలు ఆయా జిల్లాలకు కేటాయింపు మొత్తం ప్రక్రియను సకాలంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేయాలని, అంతేకాక స్పెషల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు ఈ విషయంపై పలు సూచనలు చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ.భాస్కర్ రావు, అబ్ధుల్ హమీద్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ మురళీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post