ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్

ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తు.చా తప్పకుండా పాటిస్తూ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.

ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపు పై మంగళవారం రాత్రి అయన హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో, ఉద్యోగుల నుండి తీసుకునే ఆప్షన్, సీనియారిటీ ,ప్రాధాన్యతల జాబితా, కమిటీల సమావేశాలు ఆయా జిల్లాలకు కేటాయింపు మొత్తం ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేయాలని, అంతేకాక స్పెషల్ కేటగిరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు, రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతదితరులు ఈ విషయంపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 53 శాఖలోని ఉద్యోగుల నుండి ఆప్షన్లను స్వీకరించుట జరిగిందని, ఇప్పటివరకు 48 శాఖలకు సంబంధించి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, డాటాను అప్ లోడ్ చేయడం జరిగిందని కలెక్టర్ సిఎస్ కు తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, డిఆర్ఓ హరిప్రియ జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post