ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన వారే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించబడతారని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 22 (బుధవారం).

ఉన్నత చదువులు చదివి పోటీ పరీక్షలలో అగ్రస్థానంలో నిలిచిన వారే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించబడతారని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం ఘన్పూర్ మండలం చెల్పూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ వారు 6 నుండి 10 తరగతులు వరకు చదువుతున్న 30 మంది పేద బాలబలికలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య రెండు కిలోమీటర్లకుపై దూరంలో గల గ్రామాలనుండి ప్రతి రోజు పాఠశాలకు వస్తున్న 15 మంది బాలికలకు,15 మంది బాలురకు సైకిళ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోనే భవిష్యత్తు ఉంటదని విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయులు అధికంగా టాలెంట్ కలిగి ఉండి ఉపాధ్యాయులుగా పోటీ పరీక్షల ద్వారా ఎంపికవుతారని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు వారి సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఆడపిల్లల చదువు సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని, తాము పేదరికంలో ఉన్న తమ ఆడపిల్లల భవిష్యత్తు కోసం దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు బాలికలను పంపిస్తున్న తల్లిదండ్రులను అభినందించి వారు ఆయా గ్రామాల నుండి రావడానికి రవాణా కొరకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో రీజనల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ముందుకు వచ్చి సైకిల్ ను అందించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతదని, జిల్లాలో పేద ప్రజలకు సొంత ఇండ్ల నిర్మాణం, బాలికలకు సైకిళ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వం నుండి ఎప్పటికీ సహకారం అందిస్తామని, ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిరుపేదల కోసం ఉమ్మడి రాష్ట్రంలో లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చిన సంస్థ జిల్లాలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కోరారు. అలాగే పాఠశాలలో మధ్యాన భోజనం కొరకు డైనింగ్ హాల్ నిర్మించేందుకు పరిశీలిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్డిటి రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బరావు పేదలకొరకు జిల్లాలో ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ జిల్లాలో 170 ఇండ్లు నిర్మించి చెంచులకు అందించామని, అనాదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని, విద్యార్థులకు సైకిళ్ళు అందిస్తున్నామని తెలిపి సంస్థకు అవుసరమైన సహకారాన్ని జిల్లా కలెక్టర్ అందిస్తున్నారని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జమ్మూ నాయక్ పాఠశాలలో చదువుకొని ట్రిపుల్ ఐటీ బాసర, ఇతర ప్రముఖ విద్యాసంస్థలలో ప్రవేశాలు పొందిన వారి వివరాలను తెలిపి పాఠశాలకు అవుసరమైన డైనింగ్ హాల్ నిర్మించాలని కోరారు.
సైకిల్ ను పొందిన 10 వతరగతి విద్యార్థినిలు దీక్షిత,వర్శిత, 9 వ తరగతి విద్యార్థిని ధనలక్ష్మి లు మాట్లాడుతూ దూరం నుండి పాఠశాలకు సమయానికి రావడానికి సైకిళ్ళు చాలా ఉపయోగపడుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఎఎంఓ మనోహర్ నాయక్, ఎంఇఓ సురేందర్, ఎంపిటిసిలు రజిత, రమాదేవి, సుధమ్మలు, స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post